telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..

high tech prostitution caught in hyd

హోటళ్ళు, లాడ్జీలు, స్పాల ముసుగులో వ్యభిచార దందా భాగ్య నగరి కేంద్రంగా సాగుతుంది. పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసినా ఈ దందాకు మాత్రం చెక్ పడటం లేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నిర్వాహకులు హైదరాబాద్లోని హోటల్స్ నిర్వాహకులతో కలిసి సాగిస్తున్న ఈ హైటెక్ వ్యభిచారంపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పుడు ఎన్ఐఏ కూడా నిఘా పెట్టటం విదేశీ వనితలతో సాగించే దందాకు చెక్ పెట్టటానికే అని అర్ధం అవుతుంది. విదేశాల నుండి పెద్ద సంఖ్యలో యువతులు హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్న నేపధ్యంలో ఎన్ఐఏ ఈ దందా విషయంలో ప్రత్యేకమైన నిఘా పెట్టింది. విదేశీ యువతులు పట్టుబడడంతోనే ఎన్ఐఏ కేసు నమోదు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ఏది ఏమైనా తాజా పరిణామాలు ఎన్ఐఏ దృష్టి హైదరాబాద్ మీద ఉన్నట్టు .. డేగ కన్ను భాగ్య నగరంపైన వేసినట్టు అర్ధం అవుతుంది.

హైదరాబాద్ కేంద్రంగా విదేశీ వనితలతో వ్యభిచార దందా యధేచ్చగా సాగుతుంది. ఇక తాజాగా పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ఖాన్‌, బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. విదేశీ వనితలను నగరానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల దందా కొనసాగిస్తున్నారు. ఈ సెక్స్ రాకెట్ గురించి పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దాడిచేసి చత్రినాక పోలీసుల సహాయంతో రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు.ఇక అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశ్ యువతులను స్వదేశానికి పంపారు.అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

Related posts