దైవం అనేది హిందువుల మనసుల్లో ప్రగాఢంగా నాటుకు పోయిన నమ్మకం/ధర్మం. అందుకే పూజలు సనాతనధర్మం చెప్పిన పద్దతిగా నిర్వహిస్తారు. ఆలయం అనగానే విగ్రహ ప్రతిష్ట చాలా ముఖ్యమైనది. ఈ దశలో ఆయా విగ్రహాలకు ప్రాణప్రతిష్ట కూడా జరుగుతుంది. అందుకే రోజు విధిగా పూజాదికాలలో అభిషేకం నుండి ప్రసాద నివేదన వరకు చేస్తుంటారు. అంటే అవన్నీ స్వయంగా అక్కడకు వేంచేసిన దైవానికి ప్రత్యక్షంగా వేదాలు చదివిన వారు నిత్యకృత్యాలు చేస్తుంటారు. అందుకే అక్కడ దైవం ఉంది అని అందరూ తమ బాధలు చెప్పుకొని, వాటికి పరిష్కారాలు పొందుతుంటారు. అంటే అక్కడ దైవం స్వయంగా ఉన్నట్టే భక్తులంతా భావిస్తారు. అలాగే ఓ గుడిలో నుండి రాత్రివేళ దేవతల మాటలు వినిపిస్తున్నాయట. బీహార్‌లోని, బస్తర్‌లో ఉన్న 400 ఏళ్ల నాటీ ఆలయమైన రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయంలో ఇది జరుగుతుంది.
ఇక్కడ చీకటి పడితే చాలు మాటలు వినిపిస్తుంటాయట. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ప్రతి రోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారట. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి వెళ్లి చూశారట. కానీ, ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారట. ఈ విషయం పరిశోధకులకు సైతం తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇకపోతే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం లో విఫలమయ్యారంటే.. అది నిజంగా చిత్రమే. ఇప్పుడే కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న ఆధారం కూడా దొరకలేదట. దైవం ఉన్నాడని నిరూపించేందుకు ఇదో మచ్చుతునక.
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్