telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు ఇంగ్లీష్ ను కోరుకోవడంతో ప్రతిపక్షాల యూటర్న్: మంత్రి బొత్స

అందరికి విద్య అందించాలన్న లక్ష్యంతో సంస్కరణలు చేపట్టామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు సీఆర్డీఏ  పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు మా విధానాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను తప్పనిసరిచేస్తూ ప్రకటన చేశామన్నారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని చెప్పారు. ప్రజలు మా నిర్ణయాన్ని స్వాగతించడంతో మళ్లీ వారు యూ టర్న్ తీసుకున్నారన్నారు. తెలుగు కావాలంటున్నఈ ప్రతిపక్షాల నేతలు వారి పిల్లలను, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. సామాన్యులకు కూడా ఆంగ్ల విద్యను అందుబాటులోకి తేవాలనే తాము తాపత్రయపడుతున్నామని బొత్స స్పష్టం చేశారు.

Related posts