telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో ఇంటివాడు కాబోతున్నాడు…!

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “అల వైకుంఠపురంలో” సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. తమన్ సంగీతం మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలయిన ‘సామజవరగమన’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాదిలో సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు బన్నీ. అత్యాధునిక సదుపాయాలతో విలాసవంతమైన నివాసాన్ని కడుతున్నారు. గురువారం భార్యా పిల్లలతో కలిసి కొత్త భవానానికి భూమి పూజ చేశారు. భూమి పూజ సందర్భంగా ఇటుకలు పేర్చి సిమెంట్ వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అల్లు అర్జున్. ఆ ఇంటికి ‘బ్లెస్సింగ్’ అని పేరు కూడా పెట్టారు. ఆ ఫొటో వైరల్ కావడంతో అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతున్నారు బన్నీ అభిమానులు. అల్లు అర్జున్‌కు ప్రస్తుతం జూబ్లిహిల్స్‌లో ఓ ఇల్లు ఉంది. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు సోదరులు బాబీ, అల్లు శిరీష్ కూడా ఉంటున్నారు. ఈ మధ్యే బాబీకి పెళ్లయింది. ఈ నేపథ్యంలో ఇంట్లో స్థలం సరిపోకపోవడం, ప్రైవసీ లేకపోవడం వంటి కారణాలతో కొత్త ఇంటిని నిర్మించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం తన కుటుంబంతో కలిసి ఉండేందుకు ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. అత్యాధునికి సకల సదుపాయాలతో ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేశారని.. దానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశముందని సమాచారం.

Related posts