కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు. కాగా, ఆయన్ను కుటుంబసభ్యులు ఆదివారం రోజున చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే నిమ్స్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.45 గంటలకు అయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలియజేసింది. అటు ఎం.ఎస్.ఆర్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
18 ఏళ్ళ వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని… ఎలా నిరూపించాలి ? : చిన్మయి