telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలియానా బ్రేకప్ కు కారణం డబ్బు…?

Ileana

గత కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే ఇటీవల ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పుడు వీరి బంధం విడిపోవడానికి కారణం ఎంటో తెలిసింది. ఇలియానా, ఆండ్రూతో విడిపోవడానికి మాత్రం డబ్బే కారణమట. ఇలియానా సినిమాలు మానేసి ప్రేమించిన ప్రియుడు ఆండ్రూని పెళ్ళి చేసుకుని, భర్తను ప్రేమగా చూసుకుంటూ ఇంట దగ్గరే ఉండాలని అనుకుందట. అయితే ఇలియానా తీసుకున్న ఈ నిర్ణయం.. ఆండ్రూకి నచ్చలేదని టాక్. గత కొన్ని నెలల నుండి ఇలియానా డబ్బులతో ఎంజాయ్‌ చేస్తున్న ఆండ్రూకి మనీ ప్రాబ్లమ్స్ రావడంతో ఇలియానాను మళ్లీ సినిమాలు చేయమని ఒత్తిడి తేవడం మొదలు పెట్టాడంట. పదే పదే అదే పనిగా సినిమాలు చేయమని ఆండ్రూ నుండి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక పోయిన ఇలియానా విసిగిపోయి ఆండ్రూకి బ్రేకప్ చెప్పేసింది టాక్. ఆ తరువాత ఇలియానా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టింది. త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని వార్తలు విన్పిస్తున్నాయి. అంతేకాదు ఈ బ్యూటీ చిరంజీవి సరసన కథానాయికగా నటించబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఇలియానా మతిపోగోట్టే భంగిమలో ఉన్న బికిని పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Related posts