telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబు దాతృత్వం… 1010 మంది చిన్నారులకి గుండె ఆపరేషన్లు విజయవంతం…!

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మహేష్ బాబు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ నెటిజన్ భవ్యశ్రీ అనే చిన్నారికి వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలని.. ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడమని సోషల్ మీడియాలో మహేష్ బాబుని కోరాడు. ఈ విషయాన్ని తన టీమ్ ద్వారా తెలుసుకున్న మహేష్ వెంటనే స్పందించి ఆ చిన్నారికి జూలై 17న విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో హార్ట్ సర్జరీ చేపించి చిన్నారికి ప్రాణదానం చేసారు. ఆయన ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి 1010 మంది చిన్నారులకి విజయవంతంగా గుండె చికిత్సలు చేయించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పటికే గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య, వైద్యం అందరికి అందేలా తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్నారు.

Related posts