telugu navyamedia
సినిమా వార్తలు

కూలిన మెట్రో శ్లాబ్… హీరోయిన్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Archana

ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టి అర్చ‌న క‌వికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చిలో ఆమె కారులో విమానాశ్ర‌యానికి వెళుతుండ‌గా, మెట్రో శ్లాబ్ విరిగి తాను ప్ర‌యాణిస్తున్న కారుపై ప‌డింది. అదృష్ట‌వ‌శాత్తు ఈ ప్ర‌మాదంలో కారు డ్రైవ‌ర్‌కి కాని, అర్చ‌న‌కి కాని ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గలేదు. అయితే ఈ ఘ‌ట‌న‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌మాదానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ పోస్ట్ చేశారు అర్చన. విమానాశ్రయానికి వెళుతున్న మా కారుపై మెట్రో శ్లాబ్ విరిగిపడింది. మాకు ఎలాంటి ప్రమాదము జరగలేదు. కొచ్చి మెట్రో అధికారులు, పోలీసులు ఈ ఘటనపై విచారణ జరపాలి. కారు డ్యామేజ్ కు డ్రైవర్ కు నష్టపరిహారం అందించాలని అర్చన డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్చన కోరింది. దీనిపై మెట్రో అధికారులు స్పందించారు. డ్రైవర్ ని కలసి అతడికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. అర్చ‌న 2009లో హీరోయిన్‌గా వెండితెర‌కి ఎంట్రీ ఇవ్వ‌గా, తెలుగులో 2013లో విడుదలైన “బ్యాక్ బెంచ్ స్టూడెంట్” చిత్రంలో న‌టించింది.

Related posts