telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్ “భరత్” టీజర్

Bharath

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం “భరత్”. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ లో నేవీ ఆఫీసర్ లుక్ లో కన్పించిన సల్మాన్ ఖాన్ “నీ జాతి నీ ధర్మం ఏమిటని అడిగేవారికి నేను స్మైల్ తో ఇచ్చే సమాధానం… నా తండ్రి నాకు భరత్ అని దేశానికి ఉన్న గొప్ప పేరును పెట్టారు. అలాంటి గొప్ప పేరుకు నా జాతి ధర్మం, ఇంటిపేరుని తగిలించి…. నా పేరుకు, దేశానికి ఉన్న గౌరవాన్ని తక్కువ చేయదలచుకోలేదు” అంటూ సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. దర్శకుడు అబ్భాస్ అలీ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో ఈద్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

గత ఏడాది ఖాన్ త్రయం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అందులో సల్మాన్ ఖాన్ నటించిన “రేస్-3” చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది ఎలాగైనా “భరత్” సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు సల్మాన్ ఖాన్.

Related posts