telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదు… నా సహాయం నేను చేస్తున్నా…

Tamannah

దేశంలో లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ముంబైలో ఇరుక్కుపోయిన వలస కార్మికులను ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా వారి జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా చేరారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ముంబైలోని వలస కార్మికులకు అండగా నిలిచారు తమన్నా. 10వేల మంది వలస కూలీల కోసం 50 టన్నుల ఆహార పదార్థాలను తమన్నా సిద్ధం చేశారు. వలస కూలీలను ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తమన్నా చెప్పారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్, సామాజిక దూరం ఒకటే మార్గం. మళ్లీ పాత పరిస్థితి రావడానికి కొన్ని వారాలు లేదంటే నెలలు పట్టొచ్చు. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో పేదవాళ్ల కుటుంబాలకు చాలా కాలంపాటు ఆహారం దొరకని పరిస్థితి. ఈ లాక్‌డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రతిజ్ఞ చేశాను. ఇలాంటివారిని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నాను అని తమన్నా చెప్పారు.

Related posts