telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘హౌస్‌ఫుల్ 4’ ట్విట్టర్ టాక్

HF-4

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో రాబోతున్న నాలుగో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. పునర్జన్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని అంటున్నారు. దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 25న‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 600 ఏళ్ల తర్వాత పుట్టిన స్టార్స్ ఏ ర‌కంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నార‌నేది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఇక బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ అంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. సినిమాలో అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్దే తమ హాట్‌నెస్ గ్లామర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ నటన కూడా ఫర్వాలేదనిపించిందని ట్వీట్లు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ అయ్యేలా ఉందంటున్నారు.

Related posts