telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ జోరు…

bjp party

బీజేపీ జోరు కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభంజనం మరింత బలపడిందని స్పష్టం అవుతుంది.. “ఎగ్జిట్ పోల్” అంచనాలు తప్పు అని ప్రస్తుత ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. 11 రాష్ట్రాలలోని 58 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో 38 స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో ఉందని తెలిపారు.. మణిపూర్ లోని 5 స్థానాల్లో నాలుగు, ఉత్తరప్రదేశ్ లోని 7 అసెంబ్లీ స్థానానలలో 5, గుజరాత్లోని మొత్తం 8 స్థానాలలో, మధ్యప్రదేశ్ లో 28 లో 17 స్థానాలలో, కర్ణాటకలో 2 , తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉందని తెలిపారు.. దేశంలో నలుమూలలా బీజేపీ హవా నడుస్తోంది.. మోడీ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న జీవీఎల్.. బిజెపిని తక్కువ అంచనావేసే వారు ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బీజేపీ పట్ల ఉన్న తక్కువ భావనను మార్చుకోవాలని హెచ్చరించారు జీవీఎల్ నర్సింహారావు.. బీహార్ లో “సైలెంట్” ఓటు ఎక్కువగా పోలవడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయన్న ఆయన.. బీహార్ ఓటర్లు విజ్ఞతతో ఓటు చేయడం వల్ల అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు.. ఎల్జీనీ తనకున్న సమస్యల వల్ల ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లి పోటీచేసిందన్న జీవీఎల్.. జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎల్జేపి పోటీ చేయడాన్ని బీజేపీ నుంచి తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. “కరోనా” కట్టడి చేయడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతం అయ్యాయి. “కరోనా” అనంతర పరిస్థితి మెరుగుపరచడంలో మోడీ విజయవంతం అయ్యారన్న ఆయన.. దేశంలో బిజెపి అనుకూల ఫలితాలు పార్టీ కి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి.. దీపావళి ముందుగానే వచ్చింది.. రానున్న రోజులలో మరిన్ని రాజకీయ టపాసులు పేలనున్నాయన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts