telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళా లగేజీని చెక్ చేసిన అధికారులకు షాక్… డ్రగ్స్, బంగారం కాదు… కానీ…!

baby

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఆరు రోజుల పసికందును రహస్యంగా లగేజీ బ్యాగులో పెట్టి తీసుకెళ్తుండగా విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. జెన్నిఫర్ ఎరిన్ టాల్బోట్ (43) అనే మహిళ డెట్రాయిట్ వెళ్లేందుకు మనీలా ఎయిర్‌‌పోర్ట్‌కు వచ్చింది. డెల్టా విమానం కోసం ఎదురుచూస్తున్న ఆమె లగేజీని సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. సెక్యూరిటీ సోదాల్లో ఆమె తీసుకెళ్తున్న లగేజీలో ఆరు రోజుల పసికందు బయటపడింది. పసికందును ఓ పెద్ద బ్యాగులో పెట్టి మిగతా లగేజీతో కలిపేసిందామె. దీంతో అధికారులు పసికందును బయటకు తీసి జెన్నిఫర్‌ను విచారించారు. పోలీసుల విచారణలో ఆమె ఆ పసికందుకు తాను బంధువునని చెప్పింది. కాని పసికందుతో జెన్నిఫర్‌కు ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి ఆమె వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఆమెపై పిల్లల అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు

Related posts