telugu navyamedia
రాజకీయ వార్తలు

కొలిక్కిరాని కర్ణాటక సంక్షోభం..రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్

Ramesh kumar speaker

కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ ఓ తెలుగు మీడియా చానల్ తోగా మాట్లాడుతూ రెబెల్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ సంక్షోభంలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేసినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలు తనకు చెప్పకుండానే తన కార్యాలయానికి వచ్చారని వివరించారు. అయితే ఆ సమయంలో తాను అక్కడ లేకపోవడంతో లేఖలు ఇచ్చి వెళ్లిపోయారని తెలిపారు. తాను ఆఫీసుకు వచ్చి వాళ్ల లేఖలు పరిశీలించి ఫార్మాట్ లో లేవన్న విషయాన్ని వాళ్లకు ప్రత్యుత్తరం ద్వారా తెలియపర్చానని వివరించారు.

మీకు రాజీనామా చేయాలన్న ఉద్దేశం బలంగా ఉంటే, సరైన ఫార్మాట్ లో లేఖలు ఇవ్వండి అని చెప్పాను. ఈ మధ్యలో వీళ్లేంచేశారంటే, స్పెషల్ ఫ్లయిట్ లో ముంబయి వెళ్లిపోయారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడారు. ఆపై ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో నాపై వ్యాఖ్యలు చేశారు. మేము వస్తున్నామని తెలిసి స్పీకర్ గారు పారిపోయారు అంటూ అఫిడవిట్ లో పేర్కొన్నారు. మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆయన అలా చేశారు అంటూ నాపై సుప్రీంకోర్టు లో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts