telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చిన్నప్పుడు కాగితం పడవలతో ఆడుకునేవాడిని: కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఆయన స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. స్వగ్రామాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చింతమడక వూరు వాస్తు అద్బుతంగా ఉంటుందన్నారు. దక్షిణాన దమ్మ చెరువుంటే.. ఉత్తరాన పెద్ద చెరువు ఉంటుందన్నారు. అలాగే పడమట కోమటి చెరువుంటే.. తూర్పున సింగ చెరువుంటుందన్నారు.నాలుగు మూలల పెద్ద చెరువులను తవ్వించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

చిన్నప్పుడు చెరువు పొంగితే ఇంటి ముందు కాగితం పడవలతో ఆడుకునే వాడినని కేసీఆర్ గుర్తు చేశారు.రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రారంభించిన రోజు తన జీవితంలో ఎంతో సంతోషించానని ఆయన తెలిపారు. మొదటి ప్రభుత్వంలోనే తాను చేసివుంటే వూరికే అంతా చేస్తున్నాడనే విమర్శలు వచ్చేవన్నారు. తన చిన్నతనంలో చింతమడకలో పాఠశాల, బస్సు సౌకర్యం రాలేదని, అందుకే తాను సిరిసిల్లలో చదువుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Related posts