telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా బారిన పడిన ఢిల్లీ మైదాన సిబ్బంది…

ఐపీఎల్ 2021 మ్యాచ్ లు జరిగే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారట. ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. బయో బబుల్‌ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ఇక మంగళవారం ఢిల్లీలో జరిగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది రేపటి లోగా తేలనుంది. రాజస్థాన్‌, ముంబై, హైదరాబాద్‌, చెన్నై జట్లు మ్యాచుల కోసం మే 8 వరకు ఢిల్లీలోనే ఉండనున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌ ఆరంభంలో ముంబై మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ నితీశ్‌ రాణా వంటి ఆటగాళ్లూ కూడా పాజిటివ్‌గా తేలారు. అయినప్పటికీ ఐపీఎల్‌ పాలక మండలి టోర్నీని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బోర్డు ఊపిరి పీల్చుకుంది. ఉన్నపళంగా కరోనా కేసులు రావడంతో బీసీసీఐ తలపట్టుకుంది.

Related posts