telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన తుది జాబితా విడుదల

సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగియనుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జనసేన జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీపీఐ, బీఎస్ పి లతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా కసరత్తు చేసి నామినేషన్ ల గడువుకు చివరి రోజున జాబితాను ప్రకటించింది. విజయవాడ ఎంపీ స్థానానికి ముత్తంశెట్టి సుధాకర్‌ను అభ్యర్ధిగా ప్రకటించడంపై సీపీఐ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలుత ఈ సీటును సీపీఐకీ కేటాయించారు. మరోవైపు ఇదే స్థానంలో అభ్యర్ధిని నిలపడంపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు:

వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
ఆలూరు- ఎస్‌ వెంకప్ప
నర్సీపట్నం- వేగి దివాకర్‌
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్‌ కుమార్‌ తలచుట్ల
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్‌ గౌతమ్‌
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ- కెఎల్‌ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్‌
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్‌.దయారామ్‌
కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ

పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు
విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌

నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌
హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌

 

Related posts