telugu navyamedia
Uncategorized వార్తలు సినిమా వార్తలు

హైదరాబాద్ లో మదర్ ఇండియా ఫస్ట్ ప్రెస్ మీట్ . ఎరా క్లిక్స్ మదర్‌ ఇండియా  ఏర్పాటు చేయడం అభినందనీయం  – సినీ నటుడు సుమన్‌ 

మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటేందుకు మదర్‌ ఇండియా  స్థాపించడం గొప్ప విషయమని సినీ నటుడు సుమన్‌ అన్నారు. ఎరా క్లిక్స్‌ అధినేత నక్కా వెంకట్‌రావు స్థాపించిన మదర్‌ ఇండియా సంస్థ లోగోను మంగళవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ నక్కా వెంకట్‌రావు యొక్క దార్శనికత మరియు భారతమాత పట్ల అంకితభావాన్ని ప్రశంసించారు. ఇలాంటి కాన్సెప్ట్ సమాజానికి మరింత బలాన్ని ఇస్తుందని, ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మానవ సంబంధాలు బలంగానే ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాతం నానాటికీ దిగజారిపోతున్నాయని ఇంట్లో ఎవరికి ఎవరు సంబంధం లేని పరిస్థితులు దాపురించాయని అన్నారు. ఒక తల్లి విద్యావంతురాలు కావచ్చు లేదా నిరక్షరాస్యురాలు కావచ్చు, కానీ మీరు మీ జీవితంలో విఫలమైనప్పుడు ఆమె ఉత్తమ మార్గదర్శి మరియు సలహాదారుగా ఉంటుంది, మీరు విజయం సాధించినప్పుడు, ఆమె ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.
ఈ సందర్భంగా ఎరా క్లిక్స్‌ మదర్ ఇండియా వ్యవస్థాకులు నక్కా వెంకట్రావు మాట్లాడుతూ ప్రధానంగా ఈ “మదర్ ఇండియా” కర్త కర్మ క్రియ, నా వెనుక నుండి నన్ను నడిపించిన నన్ను కన్నా నా మాతృమూర్తి “వీరమ్మ” గారిది. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి,  ప్రపంచాన్ని  శాసిస్తున్న  దుబాయ్ సిటీలో మే 14 మదర్స్ డే సందర్భంగా మదర్ ఇండియా లోగో మరియు బ్రౌచర్ను  నా కన్నతల్లి చేతుల మీదుగా లాంచ్ చేయడం, ఆ వేదిక మీద నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా తల్లిని “మదర్ ఇండియా” గా ఈ ప్రపంచానికి పరిచయం చేయటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రాంతము, భాష, కులుము, మతము, అనే భేదా లేకుండా దరికి చేర్చుకునేది తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమకు మధుర్ ఇండియా టైటిల్ కు దుబాయ్ పెద్దపీఠం వేసింది ఆ విజువల్స్ ఆ సాక్షాలు మీరు చూశారు. ఆ విశిష్టమైన ఆదరణ ప్రపంచానికి చాటి చెప్పటమే ఈ నూతన ఏరా సంకల్పం.  తల్లి గొప్పతనాన్ని చాటడంతో పాటు మదర్‌ ఇండియా పేరుతో త్వరలోనే అవార్డులు కూడా అందజేస్తామని అన్నారు. ఎంతో మంది గొప్ప తల్లుల పాదాలను తాకి, ఇంటర్వ్యూలు చేసి ఓ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓ తల్లికి తన బిడ్డపట్ల ఉన్న విజన్‌ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పులి  ఆంజనేయులు, ఆలూరి దస్తగిరి భాషా, పెద్దిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సుడిని శ్రీనివాస్‌రెడ్డి ,నక్క  రాజశేఖర్, పాండు రంగారావు, అబ్దుల్ సాలార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts