telugu navyamedia
క్రీడలు వార్తలు

వికెట్ కీపర్‌గా పంత్‌ కే ఓటు వేసిన సాహా…

bowling coach sridhar on panth and saho

టీమిండియా వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషబ్ పంత్‌ సరైనోడని సీనియర్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్ పర్యటనలో మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి పంత్ అన్నివిధాలుగా అర్హుడని సాహా పేర్కొన్నాడు. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ ఆడనుంది. తాజాగా వృద్ధిమాన్‌ సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం వెయిట్ చేస్తా. ఒకవేళ అవకాశం వస్తే నా శక్తి మేరకు పరుగులు చేస్తా. ఆ ఒక్క అవకాశం కోసం ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటా’ అని అన్నాడు. ఐపీఎల్ 2021, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీసులో పంత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. గబ్బా టెస్టులో పంత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాకు టెస్ట్ సిరీస్ అందించిన విషయం తెలిసిందే. పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నాలానే ఉండటానికి ప్రయత్నిస్తా. బాగా ఆడినా, ఆడకపోయినా నాలో ఎలాంటి మార్పు ఉండదు. నా చుట్టూ ఉన్న ఇతరులు ఏదైనా భిన్నంగా గుర్తించారో లేదో తెలీదు. ఎప్పుడూ మంచిగా ఆడటానికే ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేస్తాం. మరికొన్ని సార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని యాజమాన్యం తుది జట్టును ఎంపిక చేస్తుంది. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నా. బాగా ఆడడమే నా పని, తుది జట్టులో అవకాశం నా చేతులో ఉండదు’ అని వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు.

Related posts