telugu navyamedia
రాజకీయ వార్తలు

కాశీ ప్రభావం నాపై ఎంతైనా ఉంది: మోదీ

modi on telugu states separation

ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించుకోవడంలోనూ కాశీ ప్రభావం నాపై ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ కేవలం తన ప్రపంచం మాత్రమే కాదనిఆధ్యాత్మికంగా తనకు స్ఫూర్తి అని అన్నారు. కాశీవాసులు తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కాశీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చూసి తాను గర్విస్తున్నానని, దేశానికే కాశీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.వారణాసి నుంచి మరోసారి లోక్‌సభకు ఎన్నిక కావాలని ఆశిస్తున్న మోదీ తనను తాను ‘కాశీవాసి’గా అభివర్ణించుకున్నారు. తన విజయానికి వారణాసి ప్రజలంతా అశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

వారణాసితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన వెబ్‌సైట్‌ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. తన హయాంలో కాశీలో చేసిన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఉచిత ఎల్పీజీ, విద్యుత్ కనెక్షన్లతో అన్ని రంగాల్లో అభివృద్ధికి ఉదాహరణగా కాశీ నిలిచిందన్నారు. రెండు కొత్త కేన్సర్ ఆసుపత్రుల నిర్మాణం వారణాసి ప్రజలకు మాత్రమే కాక, చుట్టుపక్కల ప్రాంతాల వారికి సైతం ఎంతో ఉపయుక్తంగా మారిందని తెలిపారు. కాశీలోని రైతులు, వర్తకులు, వ్యాపారవేత్తలు, యువకులు, మత్స్సకారుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టమని మోదీ పేర్కొన్నారు.

Related posts