telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాన్నా ఈ సినిమా మీ కోసమే… “వెంకీ మామ” ప్రెస్ మీట్ లో వెంకటేష్

Venky-Mama

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తాజాగా ఇప్పుడు వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్‌లో వెంక‌టేశ్ మాట్లాడుతూ “నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ సినిమాకి వచ్చేటప్పటికీ నా కల నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకుంటాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా ఈ సినిమా మీ కోసమే.. చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ ఈ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. డైరెక్ట‌ర్‌ బాబీ కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది” అన్నారు.

Related posts