telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రూ. 36.00 లక్షల తో చేపట్టనున్న VDCC రోడ్డు పనులను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ సర్కిల్-18, బంజారాహిల్స్ డివిజన్ లో రూ. 36.00 లక్షలతో చేపట్టనున్న VDCC రోడ్డు పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. విడిసిసి రోడ్లను ACB కార్యాలయం నుండి బంజారాహిల్స్ NBT నగర్ జంక్షన్, బంజారాహిల్స్, లేన్ నెం.1 & 14 జంక్షన్ 120 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు, వార్డు నెం.93 లో ఎమ్మెల్యే కాలనీ, 90 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు తో  వి డి సి సి రోడ్లను నిర్మిస్తున్నారు.

అనంతరం నగర మేయర్ స్ట్రీట్ లైట్ లో భాగంగా  ఈ ఈ ఎస్ ఎల్, సి సి ఎం ఎస్ ద్వారా హైమాస్ట్ లైట్లను బంజారాహిల్స్, లేన్ నెం.1 & 14 జంక్షన్ వద్ద, ఎమ్మెల్యే కాలనీ హెచ్.డి.ఎఫ్.సి ప్రారంభోత్సవం చేశారు.

బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా ఒమేగా హాస్పిటల్ వద్ద నల్లా పైప్ లైన్  పనులను ప్రారంభించారు.

బంజారా హిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొక్కలను నాటి వాటి సంరక్షణ గేట్లను మెయింటెనెన్స్ చేయాలని యుబిడి అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, ఈ ఈ విజయమోహన్, డిప్యూటీ ఈ ఈ మణిపాల్, A.E నగేష్ బాబు, స్ట్రీట్ లైట్స్ అధికారి సుష్మ, యుబిడి  డీడీ శ్రీనివాస్. కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related posts