telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రీన్ సిటీ – తెలంగాణ హారితోత్సవం లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ లో మొక్కలు నాటిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలు భాగంగా వ్యాప్తంగా సోమవారం హరితొత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో హరిత ఉత్సవాల్లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  పాల్గొని విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  మానస పుత్రిక తెలంగాణ హరితహారంలో భాగంగా జిహెచ్ఎంసి నగర వ్యాప్తంగా మొక్కలు నాటి గ్రీన్ సిటీ గా ప్రపంచం చే గుర్తింపబడిందని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో  అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం తెలంగాణ హారితోత్సవం ఘనంగా  నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది  స్పూర్తి గా తీసుకొని నగరంలో 10 పార్కులను ఏర్పాటు చేశారు. మాస్ ప్లాంటేషన్ చేపట్టారు.

గ్రేటర్ హైదరాబాద్‌ ను మరింత పచ్చని హైదరాబాద్‌గా మార్చేందుకు.  నివాసితుల  కోసం మరిన్ని (ఆకు పచ్చ) గ్రీనారి ప్రదేశాలను సృష్టించడం.  జంటనగరాల్లో విస్తారంగా ఉన్న ప్రదేశాలలో    అడవుల పెంపకాన్ని చేపట్టడం.  అందమైన  పరిశుభ్రమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం మూలంగా  ఆహ్లాదకరమైన  జీవ-సౌందర్య వాతావరణాన్ని సృష్టించడం జరుగుతున్నది. అందులో భాగంగా   అవెన్యూ మరియు బహిరంగ ప్రదేశాల్లో చెట్ల జాతులను నాటడం ద్వారా నీరు మరియు నేల యొక్క ఇన్-సిటు పరిరక్షణ ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం జరిగింది.

GHMCలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం:
తెలంగాణకు హరిత హారం (TKHH)  తెలంగాణ రాష్ట్ర గౌ  ముఖ్యమంత్రి, గ్రీన్ కవర్, సౌందర్య విలువను పెంచడం, కాలుష్యం మరియు ఉష్ణోగ్రత ను నియంత్రించడం వంటి ముఖ్య కార్యక్రమం.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం (TKHH) ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్స్, కాలనీ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్, ఓపెన్ స్పేస్ ప్లాంటేషన్, స్మశాన వాటికలు మొదలైన వివిధ వినూత్న  పద్ధతిలో GHMC లో పచ్చదనం  పెంపకాన్ని చేపడుతోంది. 14 జూన్, 2014 నుండి ఇప్పటి వరకు చేపట్టిన హరితహారం ద్వారా మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం శాతం పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని గర్వంగా చెప్పవచ్చు.

 అవార్డులు

2021లో విడుదల చేసిన ఎఫ్‌ఎస్‌ఐ నివేదిక ప్రకారం,గత 10 సంవత్సర కాలం లో  హైదరాబాద్ నగరం 33.15 చదరపు కిలోమీటర్ల నుండి  147% పెరుగుదలతో 81.81 చదరపు కిలో మీటర్ల గరిష్టంగా అటవీ విస్తీర్ణాన్ని పెరిగినది దీనికి కారణం  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం తెలంగాణకు హరితహారం

హైదరాబాద్ నగరం యొక్క జీవవైవిధ్య సూచిక మరియు వార్డుల వారీగా గ్రీన్ కవర్ యొక్క మూల్యాంకనం న్యూ ఢిల్లీలో ఉన్న అంతర్జాతీయ సంస్థ ICLEI సౌత్ ఏషియా (ఇంటర్నేషనల్ కౌన్సెల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్స్) ద్వారా చేయబడుతుంది.  ఈ నివేదికను గౌరవనీయ  MA & UD   శాఖ మంత్రి కే టి ఆర్. విడుదల  చేశారు.  2021లో 92 పాయింట్లకు గాను 36 పాయింట్ల తో పోలిస్తే  2021లో 92 పాయింట్ల గాను 57 పాయింట్లును    హైదరాబాద్ సిటీ సాధించింది.

హైదరాబాద్ నగరాన్ని వరుసగా 2020 & 2021 సంవత్సరాలుగా అర్బర్ డే ఫౌండేషన్ మరియు FAO ట్రీసిటీ గా గుర్తించింది.
హైదరాబాద్ నగరం బ్రెజిల్‌లోని ప్యారిస్, బొగోటా, మెక్సికో సిటీ, మాంట్రియల్ మరియు ఫోర్టలేజాలను ఓడించి 2022 సంవత్సరం లో AIPH ద్వారా “వరల్డ్ గ్రీన్ సిటీ” అవార్డును అందుకుంది.

Related posts