telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటు హక్కును వినియోగించుకున్న మెగాస్టార్‌ ఫ్యామిలీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్‌ పాటిస్తూ ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే.. మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు చేశారు. అలాగే.. అమీర్‌పేటలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు భార్యతో కలిసి ఓటు వేసారు అంజనీకుమార్. ప్రశాంత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని కోరారు అంజనీకుమార్‌. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా అన్ని ఏర్పాట్లు చేసామని.. ఓటు వేస్తేనే ప్రశ్నించగలరని పేర్కొన్నారు అరవింద్‌ కుమార్‌. కరోనా జాగ్రత్తలతో పోలింగ్ జరుగుతోందని.. అందరూ పోలింగ్ లో పాల్గొనాలని కోరారు.

Related posts