నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కేరళను తాకిన 8 నుంచి 9 రోజుల్లో తెలంగాణకు వస్తాయి. ఈ నెల 9- 10 తేదీల్లో రాష్ట్రంలోకి ఇవి ప్రవేశించే అవకాశం ఉంది, జూన్ ఒకటో తేదీనే రుతుపవనాలు కేరళలోకి రంగ ప్రవేశం చేయటంతో తెలంగాణ రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం తప్పనిసరిగా నమోదవుతుందని వాతావరణ విభాగం ప్రకటించింది.
నైరుతి రుతుపవనాల వల్ల ఈసారి మంచి వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌తో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి.
ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ సీజన్‌లో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రెడ్లలో జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ