వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతివ్వడంతో కూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళిపోతున్నారు. ఇప్పటికే పలు రైళ్లలో తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. తమ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కూలీలు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
వలస కార్మికులు అందరూ దయచేసి తమ రాష్ట్రంలోనే ఉండాలని కోరారు. వలస కార్మికులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే రాష్ట్రం ఆర్థికంగా మంరింత కుంగిపోతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే ఉండి ఆర్థికంగా ఎదగడానికి తమ వంతు సహాకారం అందించాలన్నారు. కాగా ఇప్పటికే మే 4 నుంచి కంటైన్మెంట్ జోన్లు మినహా ఆర్థిక కార్యాకలాపాలకు అనుమతిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలను కుల్చోద్దు: రేవంత్