telugu navyamedia
రాజకీయ వార్తలు

సుష్మా పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి.. మోదీ ఉద్వేగ పూరిత ట్వీట్లు

sushma pm modi

సుష్మాస్వరాజ్ పార్థీవదేహాన్ని సందర్శించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుష్పాంజలి సమర్పించి ఘన నివాళి అర్పించారు. సుష్మా మరణం దేశానికి తీరనిలోటన్నారు. అత్యుత్తమ ప్రతిభావంతురాలైన పార్లమెంటేరియన్ అని కొనియాడారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు.

భారత రాజకీయాల్లో ఉజ్వల అధ్యాయం ముగిసిందని ప్రధాని మోదీ ఉద్వేగ పూరిత ట్వీట్లు చేశారు. సుష్మను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన రోజని, దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముుగిసిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సుష్మా మృతికి సంతాపంగా ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. సుష్మా మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం.. మోదీ భావోద్వేగ ట్వీట్లు

Related posts