telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 గురించి అధికారిక ప్రకటన ఎప్పుడంటే…?

new feature in ipl 2020

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -14లో మిగిలిన 31 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 రోజుల్లో లీగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయని తెలిపింది. 29న జరిగే బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో ఐపీఎల్ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించనున్నారని తెలిపింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. తొలుత న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న కోహ్లీసేన.. ఆ తర్వాత ఆగష్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌లు సిరీస్ ఆడనుంది. దీంతో సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ భావిస్తున్నది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ 41 రోజుల పాటు జరుగనున్నది. 2వ టెస్టుకు 3వ టెస్టుకు మధ్యలో 9 రోజుల గ్యాప్ ఉన్నది. దీన్ని నాలుగు రోజులకు తగ్గించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. అలా చేయడం ద్వారా ఐదవ టెస్టు సెప్టెంబర్ 14 కంటే ముందే ముగించే అవకాశం ఉంటుంది. దీంతో ఐపీఎల్‌ ప్రారంభానికి మరో నాలుగు రోజులు అదనంగా సమయం దొరుకుతుంది. బీసీసీఐకి 30 రోజుల విండో సరిపోతుంది. కానీ మరో నాలుగు రోజులు అదనంగా లభించడం ద్వారా ఇంగ్లండ్, భారత క్రికెటర్లు యూఏఈ చేరుకోవడానికి సమయం దొరుకుతుంది. లేకపోతే వీరు ఉండే టీమ్‌ల మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts