telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

10 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు…

Telangana assembly hyd

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది బీఏసీ సమావేశం.. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ తమిళిసై.. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.. ఇక, అనంతరం సభ నిర్వహణపై బీఏసీ సమావేశమై చర్చింది.. మొత్తం 10 రోజుల పాటు అసెంబ్లీ పనిచేయనుంది.. రేపు సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. సీఎం కేసీఆర్ వివరణ ఉండగా.. 18న బడ్జెట్  2021-22 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి హరీష్‌రావు.. 19న హాలీడే కాగా.. 20న బడ్జెట్ పై చర్చ, 21న మళ్లీ సెలవు, 22న బడ్జెట్ పై చర్చ.. సీఎం కేసీఆర్ స్టేట్‌మెంట్, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు.. పద్దులపై చర్చించనున్నారు. 26న ద్రవ్య వినిమయ బిల్లుకి సభ ఆమోదం పలికిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడనుంది. చూడాలి మరి ఈ 10 రోజుల సమేషలలో నాయకులూ ఏం తేల్చుతారు అనేది.

Related posts