స్టార్ కాస్ట్ : కళ్యాణ్ రామ్ , మెహ్రీన్ తదితరులు..
దర్శకత్వం : సతీశ్ వేగేశ్న
నిర్మాతలు: ఆదిత్య మ్యూజిక్
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : జనవరి 15, 2019
కళ్యాణ్ రామ్ – మెహ్రిన్ జంటగా శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేష్న దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎంత మంచివాడవురా. పక్క ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 15 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఎలా ఉంది..పబ్లిక్ ఏమంటున్నారు..సతీష్ ..కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
బాలు (కళ్యాణ్ రామ్) చిన్నప్పుడే ఓ ఆక్సిడెంట్ లో తల్లిదండ్రులు చనిపోవడం తో అనాధగా పెరుగుతాడు. బాలు మనస్తత్వం నచ్చి నందు(మెహరీన్) పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతాడు బాలు. అయితే ఈ విషయం నందు, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు బాలు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంతకీ బాలు దాచిపెట్టిన విషయం ఏంటి..? ఆ తర్వాత ఏం జరుగుతుంది..? బాలు ను ఎవరు పెద్ద చేస్తారు..అసలు బాలు కు ఎవరు ఇష్టం..అనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది.
ప్లస్ :
* కళ్యాణ్ రామ్
* వెన్నెల కిషోర్ కామెడీ
* బంధాలు – అనుబంధాలు
మైనస్ :
* కథనం
* సెకండ్ హాఫ్
* మ్యూజిక్
నటీనటుల పెర్పామెన్స్ :
ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలనే చేస్తూ వచ్చిన హీరో కల్యాణ్ రామ్ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో నటించాడు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. మెహరీన్ చక్కగా నటించింది. విలన్‌గా కనిపించిన రాజీవ్ కనకాల తనదైన పెర్మార్మెన్స్ కనబర్చాడు. నరేశ్, శరత్‌బాబు, పవిత్ర, తనికెళ్ల భరణి, విజయ్ కుమార్ తదితరులు వారివారి పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక విభాగం :
గోపీ సుందర్ పాటలు ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం ఓకే. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సన్నివేశం రిచ్‌గా, నేచురల్‌గా బావుంది. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. శతమానం భవతి, శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో విలనిజాన్ని చూపించని దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాలో విలనిజాన్ని కూడా యాడ్ చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేషన్‌లో తెరకెక్కించేసరికి అందరికి బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
రేటింగ్ : 2.5/5