telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో లేడీ డైరెక్టర్ తో నాగశౌర్య

NAga-Shourya

ఇటీవల ‘అశ్వధ్థామ’ సినిమాతో హిట్ కొట్టిన నాగ శౌర్య తాజాగా మరో సినిమా మొదలు పెట్టాడు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా సూపర్ హిట్ సినిమాలను అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నెం.8) గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 13 గురువారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటీలు, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

Related posts