భోగి పండుగ సందర్భంగా మండలంలోని పొన్నాం గ్రామంలో శ్రీకేశవస్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం మెలుకొలుపు కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులు పాటు మేలుగోలుపు నిర్వహించారు. ధనుర్మాసం చివరి రోజు అయిన మంగళవారం భోగి పండుగ సందర్భంగా వేదవిధులైన ఋత్వీజులచే నిర్వహించారు. కళ్యాణం అయిన తరువాత మధ్యాహ్నం భారీగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి కార్యక్రమం నిర్వహించారు. గోదా కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో దంపతులు, భక్తులు పోటెత్తారు.
previous post
next post
రైతులపై పడ్డ ప్రతీ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది: పవన్