telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బండికి సవాల్ విసిరిన వేముల ప్రశాంత్ రెడ్డి…’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు చూపించకుంటే బండి సంజయ్, అరవింద్‌ తమ పదవులకు రాజీనామాచేస్తారా? అని సవాల్ చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించిన ఆయన.. టీఆర్‌ఎస్‌ పార్టీ సంఖ్యాబలం ముందు రాష్ట్ర బీజేపీ బలం చాలా చిన్నదని.. టీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టడం మొదలుపెడితే బీజేపీ నేతలు గ్రామల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు కేంద్ర మంత్రులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తుంటే.. బండి సంజయ్, అరవింద్‌లు అవివేకంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం కింద పనిచేసే నీతి ఆయోగ్ కూడా తెలంగాణ సీఎంను ప్రశంసించిందని గుర్తుచేశారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేయించి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదకాలువకు రివర్స్ పంపింగ్ ద్వరా నీటిని తెచ్చిన మొనగాడు కేసీఆర్.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌లో పెన్షన్ రూ.600, ఉత్తర ప్రదేశ్‌లో రూ.500, బీహార్‌లో రూ. 400 ఇస్తున్నారు.. అలాంటి మీరు రూ.2016 ఇచ్చే కేసీఆర్‌ను విమర్శిస్తారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చూపించండి అంటూ సవాల్ చేసిన మంత్రి వేముల.. బడుగు, బలహీన వర్గాల పిల్లలకోసం 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి సన్నబియ్యంతో వారికి భోజనం పెట్టి మంచి విద్యను అందిస్తున్నామని తెలిపారు.. గతంలో 20 నుంచి 30 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే కోటి 10 లక్షల ఎకరాల్లో వరి పంట పండేటట్లు చేశాం.. దాని కోసం రైతులకు సాగునీరు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఈ ఘనత సాధించారని వెల్లడించారు.

Related posts