telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

స్టీల్‌ ప్లాంట్‌ : సీఎం జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ సలహాలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్‌ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక నేత, మంత్రి కేటీఆర్‌ అలాగే మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు వెనక్కి తగ్గవద్దని పిలుపునిచ్చారు. అయినప్పటికీ…కేంద్ర ప్రభుత్వం మాత్రం… స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని మొండిపట్టు పట్టింది. అయితే.. తాజాగా జనసేన అధినేత స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపై స్పందించారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల ఆందోళనల మధ్య ఆ కార్పొరేషన్‌ ను గెలుచుకున్న వైసీపీకి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. మరింత బాధ్యతతో వైసీపీ… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు పవన్‌. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్టీల్‌ ప్లాంటు సమస్యపై మాట్లాడాలని… అక్కడ జరుగుతున్న ఆందోళనలు-భూములు ఇచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. 22 మంది ఎంపీలున్న వైసీపీనే..ఢిల్లీలో ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. 

Related posts