telugu navyamedia
సినిమా వార్తలు

సంపూ ‘ధగడ్ సాంబ’ టీజర్ రిలీజ్‌

హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన‌ బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు.డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి రెడీ అయ్యారు సంపూ..

బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన  ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత అర్.ఆర్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ ”ధగడ్ సాంబ”  టీజర్ ను  ఘనంగా విడుదల చేశారు.

సంపు గారు డబ్బు కాదు ముఖ్యం. ముందు సినిమా చెయ్యండి అని మాకు ధైర్యాన్ని ఇస్తూ మాకు అండగా నిలిచారు. నిర్మాత రాజు గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ ఫుల్ సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తార‌ని చిత్ర దర్శకుడు యన్.ఆర్.రెడ్డి అన్నారు.

ఈ మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. “ధగడ్ సాంబ” చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చిత్ర నిర్మాత రాజు అన్నారు.

Related posts