టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కొద్దిరోజుల క్రితం తన పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. తమ ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ప్రకటించింది. కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలిపింది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంటున్నట్లు కాజల్ వెల్లడించింది. తన స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. అయితే దసరా పండగ సందర్భంగా వారందరినీ సర్‌ప్రైజ్ ఇస్తూ కాజల్ తన కలల రాకుమారుడితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలో.. గౌతమ్ తనకు కాబోయే భార్యను దగ్గరికి తీసుకోగా… కాజల్ అతడి భుజాలపై ఆనుకుని సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
next post