telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ హైకోర్టు స్టే!

ap high court

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధానులపై విడుదల చేసిన గెజిట్ ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

Related posts