telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భాగ్యనగరంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

rain hyderabad

హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీవర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

నగరంలోని జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, గాజుల రామారం, సూరారం, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, దారుస్సలాం సహా పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షానికి అంబర్‌పేట- మూసారాంబాగ్ వద్ద మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Related posts