telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చిరు రాజకీయాలపై స్పందించిన పవన్…

pawan

జనసేన ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి పరిమితం కాదన్న పవన్ కళ్యాణ్ నాకు మానవత్వం ఉందే తప్ప నా కులానికి ఏదో చేసేయలని లేదని అన్నారు. కాపుల గురించి జరిగే అన్యాయంపై స్పందిస్తాననన్న ఆయన కాపులకు జరిగే సమస్యలు పరిష్కారానికి  జనసేన అండగా ఉంటుందని అన్నారు. కాపులు బలపడటం అంటే బీసీలు బలహీన పడటం కాదని ఆయన అన్నారు. ఆవేదన ఆవేశంగా మారినపుడు తుని వంటి దుర్ఘటనలు జరుగుతాయని, భవిష్యత్ లో ఎలాంటి అవసరాలు కాపు సంక్షేమ సేనకు ఉన్నా జనసేన సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఇక చిరు రాజకీయాలపై పవన్ ఆసక్తికరంగా స్పందించారు. చిరంజీవి నైతిక మద్దతు ఎపుడూ నాకు ఉంటుందని, తమ్ముడిగా నా విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని అన్నారు. చిరంజీవి అందరి మంచి కోరుకుంటారన్న ఆయన పార్టీలోకి వస్తారా అనేది ఇపుడే ఏం చెప్పలేను అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఒకరినని, చిరంజీవి నా మేలు కోరుకునే వ్యక్తి అందులో రెండో మాట లేదు అన్నారు. చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని గౌరవిస్తానని చిరంజీవి నైతిక మద్దతు నాకు ఉంటుంది అని పేర్కొన్నారు.

Related posts