telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్.. నేటి షెడ్యూల్​ ఇదే..

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దేశ‌వ్యాప్తంగా ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల పర్యటన లో భాగంగా సీఎం కేసీఆర్‌ నేడు (మే 22)చండీగఢ్‌లో పర్యటన చేయనున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను కేసీఆర్ కలవనున్నారు. వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో కలిసి అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

తొలుత ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత.. ఇద్దరు నేతలు కలిసి చండీగఢ్‌‌కు బయలుదేరనున్నారు. అక్కడ సుదీర్ఘ రైతు ఉద్యమంలో మరణించిన సుమారు 600 మంది రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ కలుస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. అన‌తంరం ఛండీగడ్‌లో ఈ కార్యక్రమం ముగిశాక కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీకి పయనం కానున్నారు.

Related posts