telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

డిఎండికె కూటమిలో ఉంటుందా… పోతుందా…?

తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది.  అన్నాడీఎంకే కూటమిలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకె, పీఎంకే, బీజేపీ, కెప్టెన్ డిఎండికె పార్టీలు ఉన్నాయి.  వీటితో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే.  2006లో హీరో విజయ్ కాంత్ డిఎండికె పార్టీని స్థాపించారు.  అప్పటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్కస్థానం మాత్రమే గెలుచుకున్నారు.  ఆ తరువాత 2011లో పదిశాతం ఓటింగ్ ను సాధించారు.  అయితే, 2016లో అన్నాడీఎంకే కూటమితో చేతులు కలిపి ఘోరంగా దెబ్బతిన్నది.  అప్పటి నుంచి డిఎండికె పార్టీని కూటమి పెద్దగా పట్టించుకోవడం లేదు.  విజయ్ కాంత్ అనారోగ్యం కారణంగా పార్టీ బాధ్యతలను అయన భార్య ప్రేమలత చూసుకుంటున్నారు.  ప్రేమలత అనేకమార్లు తాము కూటమిలోని ఉన్నామని చెప్తున్నా, కూటమి పట్టించుకోకపోవడంతో ఈరోజు కోయంబేడు ప్రధాన కార్యాలయంలో 234 నియోజకవర్గాల ఇంఛార్జులతో మీటింగ్ ను ఏర్పాటు చేశారు. చూడాలి మరి ఈ చర్చలో ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది.

Related posts