వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, లారీ, బస్సు మూడు వాహనాలు ఢీ కొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా… ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోని తప్పించబోయి బస్సు బోల్తా కొట్టగా.. వెనకాల వస్తున్న లారీ…. బస్సు, ఆటోని ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగడంతో రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి వాహనాలు. అయితే.. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులోని ప్రయాణికులు ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. కాగా.. చనిపోయిన వారంతా మోమిన్ పేట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
previous post