telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

జగన్ సీఎం అయితే ఎక్కడనుండి పరిపాలన సాగిస్తాడు.. లోటస్ పాండా ? అయితే మాకొద్దు..

poling in telugu states on 15th april

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ, వైసీపీ అధినేత జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేసిన వాళ్లు.. ఇప్పుడు జగన్ ముసుగులో మరోసారి రాష్ట్రంపై దాడికి వస్తున్నారంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రుల ఆత్మాభిమానంపై జగన్, కేసీఆర్‌లు కలిసి దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీని తెలంగాణకు బానిసగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. తాను బతికి ఉన్నంత వరకు అలా జరగనివ్వనని అన్నారు. ఏపీని తెలంగాణకు మించిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలు లూటీ చేసి, 31 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఓట్ల దొంగగా మారారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే జగన్‌కు ఈ విద్య నేర్పారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

YS Jagan Write letter to KCRరెండు తెలుగు రాష్ట్రాలలో వ్యాపారస్తులు అంతా ఏపీకి చెందిన వారే కావటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీని గుప్పెట్లో పెట్టుకోవాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ తన చెప్పుచేతులలో ఉంటుందని బావిస్తున్నట్టే ఉంది. అందుకే జగన్ కు మద్దతు పలుకుతూ, ఆయన సీఎం కావాలని తెరవెనుక చేయాల్సిన కృషి అంతా చేస్తున్నాడు కేసీఆర్. అయితే ఇదంతా విజయవంతం అయితే జగన్ హైదరాబాద్ లో నే ఉంటాడు.. ఇక పాలన అంతా కూడా లోటస్ పాండ్ నుండే సాగుతుంది. తద్వారా ఏపీలో మళ్ళీ ఖాళీ తప్ప మరేమి ఉండకుండా.. కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంటాడు .. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఖచ్చితంగా ఏపీ భవిష్యత్తుకు మంచిది కాదని వారు అంటున్నారు.

ఇక కేసీఆర్ ఆలోచనలో మంచి ఉన్నట్టయితే ఏపీ, తెలంగాణలను కలిసి అభివృద్ధి చేస్తాడని అనుకున్నా .. అదేదో ఊహ అనిపిస్తుంది తప్ప నిజంలా తోచడంలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకొని, ఏపీలో ఉంది పరిపాలన సాగిస్తేనే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం లేదంటే.. మరో ఐదేళ్లు కూడా అభివృద్ధి నోచుకోక.. ఏపీ దారుణ స్థితిలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాసులు ఎదుర్కొన్న ప్రతి సమస్య ఏపీలో తరువాతి ఐదేళ్లు ప్రజలు ఎదుర్కోవాల్సి రావచ్చని.. అందుకే ఈ ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Related posts