తనీష్ హీరోగా ‘మహాప్రస్థానం’ తెరకెక్కిస్తున్నారు. ‘జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ‘అంతకుమించి’ తరహా హారర్ థ్రిల్లర్‌ను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు జాని, తన రెండో చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి, కంచరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు.
క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో తెరకెక్కనుంది. డిసెంబర్ తొలివారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. ఈ చిత్రం గురించి దర్శకుడు జాని మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమ కథకు తనీష్ సరిగ్గా సరిపోతారు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో మనల్ని లీనం చేస్తుంది’ అని తెలిపారు.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స