టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సీఎం జగన్ పై ఆగరహం వ్యక్తం చేసారు. జగన్… రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శలు చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికలను భ్రష్టుపట్టించారని ఆరోపించిన ఆయన.. ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని.. సుప్రీంకోర్టు చెబితే కానీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని మండిపడ్డారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారన్న కళా వెంకట్రావు.. చిత్తూరు జిల్లాలో నిన్న చంద్రబాబును అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మేం ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో స్వేశ్ఛాయుత వాతావరణం లేదన్న మాజీ మంత్రి.. ఈ ప్రభుత్వానికి ఓటుద్వారానే ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు… అలాగే ఈ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఏ విధంగా సమాధానం ఇస్తారు అనేది.
previous post
బాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా?: అంబటి