భారతీయ జర్నలిస్టుల వాట్సాప్ అకౌంట్లను ఇజ్రాయిల్ స్పైవేర్ సంస్థ హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ఈ విషయాన్ని ద్రువీకరించింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో సంస్థ అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసస్ వైరస్‌తో ఈ నేరానికి పాల్పడ్డారు. ఎన్ఎస్‌వో గ్రూపుపై దావా వేయనున్నట్లు వాట్సాప్ చెప్పింది. సుమారు 1400 మంది యూజర్ల ఫోన్లను వాట్సాప్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సుమారు నాలుగు ఖండాలకు చెందిన ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులను హ్యాక్ చేశారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన మాల్‌వేర్ .. యూజర్ల మెసేజ్‌లను, కాల్స్, పాస్‌వర్డ్‌లను చోరీ చేసింది. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అటాక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డేటాను దొంగలించాయి. అయితే కచ్చితంగా ఎంత మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న విషయాన్ని మాత్రం వాట్సాప్ స్పష్టం చేయలేకపోయింది.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈసీ పనిచేస్తోంది: ఎంపీ కనకమేడల