telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఐపీఎల్ తో ప్రజల మానసిక స్థితి మారుతోంది: గంభీర్

Gautam Gambhir bjp

ఐపీఎల్ టోర్నమెంట్ మొదలైతే దేశ ప్రజల మానసిక స్థితి మారుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. కరోనా భయం నుంచి ప్రజలు బయటకు వస్తారని పేర్కొన్నారు. ఐపీఎల్-13వ సీజన్ మొదలైతే ప్రస్తుత భయానక, ఆందోళనకర స్థితి నుంచి దేశ ప్రజలకు ఊరట లభిస్తుందని చెప్పారు. ఐపీఎల్ మ్యాచులు ఎక్కడ జరిగినా ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

19 సెప్టెంబరు నుంచి 8 నవంబరు వరకు ఐపీఎల్ జరగనుండగా, యూఏఈ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆట ప్రారంభమైతే దేశం మూడ్ మారుతుందని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత కరోనా భయాందోళనల మధ్య ఐపీఎల్ జరిగితే గతంలో జరిగిన లీగ్‌ల కంటే గొప్పగా నిలిపోతుందని గంభీర్ వ్యాఖ్యానించారు.

Related posts