telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెల్లెలిని ఏకంగా 190 సార్లు పొడిచి… తనకంటే అందంగా ఉందని…!?

Russian

ఎలిజవేటా డుబ్రోవినా, స్టెఫానియా డుబ్రోవినా అక్కచెల్లెలు. చిన్నదైన స్టెఫానియా మోడల్. సోదరి అందంపై అసూయ పెంచుకుంది. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని తలచిన ఎలిజవేటా 2016లో ప్రణాళిక ప్రకారం చెల్లెల్ని అతి కిరాతకంగా కత్తితో 190 సార్లు పొడిచింది. యువతి ముఖ్యమైన శరీర భాగాలపై ఆమె దాడికి పాల్పడింది. రెండు కను గుడ్లు పీకేసి, ఒక చెవి కూడా కోసేసింది. కేవలం చెల్లెలు తన కంటే అందంగా ఉండడం ఒర్వలేని అక్క ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్టెఫానియా అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్ అలెక్సీ ఫతేవ్ తీవ్రమైన గాయాలతో నగ్నంగా పడి ఉన్న ప్రేయసిని చూసి నిర్ఘాంతపోయాడు. పక్కనే రక్తపు మరకలతో చేతిలో కత్తితో ఉన్న ఎలిజవేటాను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. గత మూడేళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసులో తాజాగా న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారు చేసింది. చెల్లెలి అందంపై అసూయతోనే చంపేసినట్టు ఎలిజవేటా కోర్టులో తన నేరాన్ని అంగీకరించింది. దాంతో న్యాయస్థానం ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

Related posts