telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ డబ్బులతో ఎన్నికలను శాసిస్తోంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ కు ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

డబ్బులతో ఎన్నికలను టీఆర్ఎస్ శాసిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల తక్కువ మెజార్టీతోనే టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశంసించారు. తన రెండు మున్సిపాలిటీలను గెలిపించుకున్న హరీశ్ కు, వందకు పైగా సీట్లు గెలుస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న కేటీఆర్ కు అభినందనలు తెలియజేశారు.

Related posts