పేదల సంక్షేమమే ధ్యేయంగా చేస్తానని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఒక సామన్య కార్యకర్త అయిన నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు త్తెలిపారు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు నేను గెలవాలని తపించారన్నారు.
కార్యకర్తలకు రూపాయి ఖర్చు చేయకపోయినా సొంతంగా పెట్రోల్ పోసుకొని నా కోసం ఇల్లిల్లు తిరిగారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. పార్లమెంట్ సమావేశాలకు, కరీంనగర్ ప్రజల పనుల కోసం తప్ప ఢిల్లీ, హైదరాబాద్‌కు వెళ్లనని అన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానాన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మెద్దని కోరారు.